![]() |
![]() |

బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది. తొమ్మిదో వారంలో అనూహ్యంగా విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న విశ్వ ఫైనల్ కి చేరతాడని భావించారంతా. కానీ ఊహించని విధంగా ఆయన ఎలిమినేట్ కావడంతో ఆడియన్స్ తో పాటు హౌస్ మేట్స్ కూడా షాక్ అయ్యారు. నిజంగా ఓట్లు తక్కువ పోలై విశ్వ ఎలిమినేట్ అయ్యాడా? లేక మరేదైనా కారణముందా అనే చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తొమ్మిది వారాలకు గాను విశ్వకు భారీగానే రెమ్యునరేషన్ ముట్టినట్లు తెలుస్తోంది.
లాక్ డౌన్ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు విశ్వ పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు. అయితే బిగ్ బాస్ షో పుణ్యమా అని ఆయన ఆ ఇబ్బందుల నుండి బయటపడినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ లో విశ్వకి రెమ్యునరేషన్ బాగానే ముట్టిందట. వారానికి రెండున్నర లక్షల చొప్పున తొమ్మిది వారాలకు గాను 22లక్షలు ఆయనకు ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
గతంలో బుల్లితెరపైనా, వెండితెరపైనా నటుడిగా అలరించిన విశ్వ.. బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో నటుడిగా ఇంకా బిగ్ ఆఫర్స్ దక్కించుకుని సత్తా చాటుతాడేమో చూడాలి.
![]() |
![]() |